బ్రహ్మచారి అయిన అయ్యప్ప మహిళలను చూసేందుకు ఇష్టపడడు: సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదన

27-07-2018 Fri 12:58 | National
  • రుతుస్రావ వయసు మహిళలను చూసేందుకు ఇష్టపడరు
  • కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవించాలన్న పరాశరన్
  • లింగం, కులం ఆధారంగా వివక్ష చూపించరాదన్న ధర్మాసనం
శబరిమలలోని పరమ పవిత్ర అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను అనుమతించే విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఆసక్తికర వాదనలు జరిగాయి. నాయర్ సొసైటీ తరఫున మాజీ అటార్నీ జనరల్ పరాశరన్ వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పది సంవత్సరాలలోపు, 50 ఏళ్లకు పైబడిన మహిళలను ఆలయంలోకి అనుమతిస్తున్నట్టు న్యాయస్థానానికి గుర్తు చేశారు. అయ్యప్ప నిష్ఠగల బ్రహ్మచారని, 10 నుంచి 50 ఏళ్ల వయసు... అంటే రుతుస్రావ వయసులో ఉన్న మహిళలను చూసేందుకు ఆయన ఇష్టపడడని కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తున్నారని చెప్పారు. వారందరి మనోభావాలనూ గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ, హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడారు.

పరాశరన్ వాదనలను చాలా ఓపికగా విన్న ధర్మాసనం, కేవలం లింగం, కులం ఆధారంగా ఆలయాల్లో వివక్ష చూపే సంప్రదాయాలను కొట్టివేసే అధికారం తమకుందని స్పష్టం చేసింది. మతం ప్రాతిపదికన తప్పనిసరిగా భావించే ఆచారాలకు ప్రాథమిక హక్కుల నుంచి మినహాయింపు ఇవ్వలేమని, ఇది అన్ని మతాలకూ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. మహిళలపై వివక్ష చూపించే అధికారం ఎవరికీ లేదని వెల్లడిస్తూ, కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.
SabarimalaAyyappaSupreme Court

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more